వరుస అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి

ఇంతవరకూ ఈ సంవత్సరం ఒక సినిమా విడుదలైంది. ఒకటి షూటింగ్ దశలో ఉంది, మరో రెండు చిత్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. మీనాక్షి చౌదరి కెరీర్ ఈ ఏడాది నిజంగా వేగంగా దూసుకెళ్తోంది.;

By :  K R K
Update: 2025-04-17 00:38 GMT

ఈ సంవత్సరం ఆరంభంలో విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా అందాల హీరోయిన్ మీనాక్షి చౌదరి కెరీర్‌లో అద్భుత విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో ఆమె పోలీస్ అధికారిగా, వెంకటేష్ మాజీ ప్రేయసిగా అలరించింది. ఈ పాత్ర ఆమెకు విపరీతమైన గుర్తింపునిచ్చింది, ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ అయ్యింది. ఇప్పుడు, మీనాక్షి కొత్త ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతోంది.

తాజాగా ఆమె నాగచైతన్యకు జోడీగా నటించబోయే సినిమా ఓకే చేసింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించబోయేది “విరూపాక్ష” వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన కార్తిక్ దండు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. మీనాక్షి ఇప్పటికే ఈ సినిమాకు అంగీకారం తెలిపినా.. నిర్మాతలు అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వలేదు.

అంతేకాదు.. నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న “అనగనగా ఒక రాజు” చిత్రంలో కూడా మీనాక్షి నాయికగా నటిస్తోంది. అలాగే.. సితార ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థతో కూడా ఆమె మరో సినిమా గురించి చర్చల్లో ఉంది. ఇంతవరకూ ఈ సంవత్సరం ఒక సినిమా విడుదలైంది. ఒకటి షూటింగ్ దశలో ఉంది, మరో రెండు చిత్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. మీనాక్షి చౌదరి కెరీర్ ఈ ఏడాది నిజంగా వేగంగా దూసుకెళ్తోంది. అనేక అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తుండగా.. ప్రేక్షకులు ఆమె నటనను మరింతగా ఆస్వాదించబోతున్నారు.

Tags:    

Similar News