మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా?

ఒక పాట షూటింగ్ పెండింగ్‌లో ఉండటమే ఈ డిలేకి ప్రధాన కారణం. టాలీవుడ్ ఉద్యోగుల సమ్మె వల్ల ఈ షూట్ పూర్తి కాలేదు. అంతేకాదు, కొన్ని సీన్స్‌ను రీషూట్ చేయాల్సి ఉంది.;

By :  K R K
Update: 2025-08-16 01:19 GMT

మాస్ మహారాజా రవి తేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా, వినాయక చవితి కానుకగా.. ఆగస్టు 27న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇప్పుడు సెప్టెంబర్‌కు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఒక పాట షూటింగ్ పెండింగ్‌లో ఉండటమే ఈ డిలేకి ప్రధాన కారణం. టాలీవుడ్ ఉద్యోగుల సమ్మె వల్ల ఈ షూట్ పూర్తి కాలేదు. అంతేకాదు, కొన్ని సీన్స్‌ను రీషూట్ చేయాల్సి ఉంది.

ఇటీవల రిలీజ్ అయిన ఒక పాటలోని “ఊర మాస్” లిరిక్స్‌పై సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ జరిగింది. దీంతో.. మేకర్స్ ఆ లిరిక్స్‌ని మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మరింత క్వాలిటీగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది.

ఈ వీకెండ్ తర్వాత ఫైనల్ కాల్ తీసుకోనున్నారు. ‘మాస్ జాతర’ లో రవి తేజ పోలీస్ రోల్‌లో, శ్రీలీల స్టూడెంట్‌గా కనిపించనున్నారు. రచయిత భాను భోగవరపు తొలి డైరెక్టోరియల్ వెంచర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. మరి ఈ సినిమా అయినా రవితేజకు మంచి సక్సెస్ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News