‘అత్తరు సాయిబు’ గా మంచు మనోజ్ !
మనోజ్ మరో ఆసక్తికరమైన సినిమాకు సైన్ చేసినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమా పేరు ‘అత్తరు సాయిబు’ అని సమాచారం. ‘90 యం.ఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.;
ప్రముఖ నటుడు మంచు మనోజ్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. ‘ఆపరేషన్ 2019’ తర్వాత సుదీర్ఘంగా ఏడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న మనోజ్, మళ్లీ భారీ ప్రాజెక్టులతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ‘భైరవం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్‌లో హీరోగా నటిస్తున్నారు. అలాగే, తేజ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న సూపర్ హీరో మూవీ ‘మిరాయ్’ లో ప్రధాన ప్రతినాయకుడిగా మనోజ్ కనిపించబోతున్నారు.
వీటితో పాటు మనోజ్ మరో ఆసక్తికరమైన సినిమాకు సైన్ చేసినట్టు టాలీవుడ్ సమాచారం. ఈ సినిమా పేరు ‘అత్తరు సాయిబు’ అని సమాచారం. ‘90 యం.ఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పూర్తిగా వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. మే 20న, అంటే మనోజ్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమాను గ్రాండ్ లాంచ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇకపోతే, మనోజ్ చేయాల్సిన మరో రెండు సినిమాలు ‘వాట్ ది ఫిష్’, ‘అహం బ్రహ్మాస్మి’ గతంలో ప్రకటించబడ్డప్పటికీ ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. వీటి నిర్మాణం పునఃప్రారంభమవుతుందా అనే విషయమై ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ, మనోజ్ మాత్రం ఈ ప్రాజెక్టులపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మంచు మనోజ్ తిరిగి తెరపైకి రావడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.