‘మ్యాడ్ స్క్వేర్’.. మస్త్ ఫన్ రైడ్‌కు రెడీ!
‘మ్యాడ్ స్క్వేర్’.. మస్త్ ఫన్ రైడ్‌కు రెడీ!నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ సక్సెస్‌ను కొనసాగిస్తూ 'మ్యాడ్ స్క్వేర్' రూపొందుతుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా 'మ్యాడ్'కి సీక్వెల్‌గా రాబోతోంది.
ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతంలో ఇప్పటికే విడుదలైన 'లడ్డుగాని పెళ్లి, స్వాతి రెడ్డి' పాటలు చార్ట్‌బస్టర్స్ అయ్యాయి. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'మ్యాడ్ స్క్వేర్' టీజర్ ను ఈరోజు మధ్యాహ్నం 3.33 గంటలకు విడుదల చేయబోతున్నారు. యూత్‌ఫుల్ కామెడీ, పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిసిన ‘మ్యాడ్ స్క్వేర్’ మరోసారి బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.