‘కన్నప్ప’ లవ్ యాంగిల్

Update: 2025-03-10 12:54 GMT

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘శివ శివ శంకర’ పాట, టీజర్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇప్పుడంతా ప్రమోషన్ మూడ్‌లో ఉన్న చిత్రబృందం తాజాగా ఓ సాఫ్ట్ లవ్ మెలోడీని విడుదల చేసింది.


Full View



‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఈ పాటలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ జంటగా మెరిశారు. రేవంత్, సాహితి చాగంటి ఆలపించిన ఈ గీతానికి స్టీఫెన్ దేవస్సీ స్వరాలు అందించగా, శ్రీమణి సాహిత్యం అందించారు. ప్రభుదేవా, బృందా కొరియోగ్రఫీతో ఈ పాట విజువల్‌గా ఆకట్టుకునేలా రూపొందింది.

పురాణ కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, ప్రభాస్ రుద్రుడిగా నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News