అట్లీ సినిమా కోసం ముంబైలో ల్యాండ్ అయిన బన్నీ !

తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అతను, ఎప్పటిలాగే స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. ఆల్-వైట్ లుక్‌లో కనిపించిన అతడు అభిమానులతో పాటు ఫ్యాషన్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించాడు.;

By :  K R K
Update: 2025-07-25 03:21 GMT

అల్లు అర్జున్ ఇటీవల హాలిడే కోసం అమెరికా వెళ్లి.. తన కుటుంబంతో యూనివర్సల్ స్టూడియోస్‌లో సరదాగా గడిపాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ముంబైకి తిరిగి వచ్చిన అతను.. తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో తన కొత్త సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించ నున్నాడు. ఎయిర్‌పోర్ట్ లుక్‌లో అల్లు అర్జున్ మళ్లీ మెరిశాడు.

తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అతను, ఎప్పటిలాగే స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు. ఆల్-వైట్ లుక్‌లో కనిపించిన అతడు అభిమానులతో పాటు ఫ్యాషన్ ఔత్సాహికుల దృష్టిని ఆకర్షించాడు. పాపరాజీలతో స్మైల్‌తో సంభాషించిన అతని కూల్ లుక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది.

అట్లీ సినిమా కోసం అతను ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాడనే టాక్ కూడా హైలైట్ అయింది. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ జూన్ చివరిలో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ వరకు కొనసాగనుంది. ముంబైలో స్పెషల్‌గా డిజైన్ చేసిన వీఎఫ్ఎక్స్ సెట్‌లో అల్లు అర్జున్ షూటింగ్ చేస్తున్నాడు.

ప్రీవిజువ లైజేషన్‌తో చాలా సీన్స్ షూట్ చేస్తున్నారు. తర్వాత వీఎఫ్ఎక్స్, సీజీఐతో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఎలివేట్ చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో అతను లాస్ ఏంజిల్స్‌లోని స్టూడియోలో కొన్ని సీన్స్ షూట్ చేయడానికి వెళ్లనున్నాడు. ఈ సై-ఫై థ్రిల్లర్‌లో అత్యాధునిక వీఎఫ్ఎక్స్, యానిమాట్రానిక్స్ ఉంటాయి.

Tags:    

Similar News