అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న ‘కుబేర’

‘కుబేర’ చిత్రం ఇప్పటికే బుక్‌మైషో లాంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ స్పాట్ సొంతం చేసుకుంది. గత 24 గంటల్లో 12 వేలకు పైగా టికెట్లు అమ్ముడవడం, అదీ రిలీజ్‌కి మూడు రోజుల ముందు, సోషల్ డ్రామా లాంటి జోనర్‌కి ఇది అద్భుతమైన ఫీట్.;

By :  K R K
Update: 2025-06-18 01:59 GMT

తెలుగు ప్రేక్షకులు థియేటర్లలో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్ చేసేందుకు ఓ సాలిడ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్‌ని పర్ఫెక్ట్‌గా క్యాష్ చేసుకోబోతోంది ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో వస్తున్న ‘కుబేర’ సినిమా. జూన్ 20న.. అంటే మరో రెండు రోజుల్లో ‘కుబేర’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా చుట్టూ హైప్ పీక్స్‌లో ఉంది. దీనికి కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ముల ట్రాక్ రికార్డ్, అదిరిపోయే స్టార్ కాస్ట్.

శేఖర్ కమ్ముల తన ఎమోషనల్ స్టోరీటెల్లింగ్‌తో ‘ఫిదా, లవ్ స్టోరీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చారు. మరోవైపు, నాగార్జున ఎర్లియర్ గా ‘నా సామి రంగ’ తో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు. ధనుష్ ‘సార్, రాయన్’ లాంటి సినిమాలతో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్నాడు. రష్మిక మందన్న పలు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉంది.

థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ‘కుబేర’ సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రేక్షకుల నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే మేజర్ సిటీస్‌లో థియేటర్లలో టికెట్ సేల్స్ భారీగా పెరిగాయి, ఇది ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది.

‘కుబేర’ చిత్రం ఇప్పటికే బుక్‌మైషో లాంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ స్పాట్ సొంతం చేసుకుంది. గత 24 గంటల్లో 12 వేలకు పైగా టికెట్లు అమ్ముడవడం, అదీ రిలీజ్‌కి మూడు రోజుల ముందు, సోషల్ డ్రామా లాంటి జోనర్‌కి ఇది అద్భుతమైన ఫీట్. మొత్తంగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News