ఆ పాట నాకు గుణపాఠం నేర్పింది : కేతికా శర్మ
మొదటి ఐటెం సాంగ్ రాబిన్ హుడ్ మూవీ లోని 'ఇది డా సర్ప్రైజ్' అనే పాట చర్చనీయాంశంగా మారిన వివాదంపై కెటికా స్పందించింది. ఈ పాటలోని నృత్యశైలిని ‘అశ్లీలం’గా అభ్యంతరాలు వ్యక్తం చేశారు పలువురు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో కేతిక స్పందించింది.;
అందాల హీరోయిన్ కేతికా శర్మ ప్రస్తుతం తన రాబోయే సినిమా ‘సింగిల్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2025 మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మరో ముఖ్యమైన మహిళా పాత్రలో ఇవానా కూడా కనిపించనుంది.
“ఈ సినిమాలో నేను పూర్వ అనే పాత్రలో కనిపిస్తాను. ఆమె ఒక స్వతంత్రమైన యువతి. సినిమాలో కొన్ని సీరియస్ అంశాలు ఉన్నా కూడా ఇది పూర్తిగా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ప్రేమకథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. నా పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది.” అని కేతిక సింగిల్ లోని తన పాత్ర గురించి చెప్పింది.
అలాగే.. ఆమె మొదటి ఐటెం సాంగ్ రాబిన్ హుడ్ మూవీ లోని 'ఇది డా సర్ప్రైజ్' అనే పాట చర్చనీయాంశంగా మారిన వివాదంపై కెటికా స్పందించింది. ఈ పాటలోని నృత్యశైలిని ‘అశ్లీలం’గా అభ్యంతరాలు వ్యక్తం చేశారు పలువురు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో కేతిక స్పందించింది.
“ఆ పాట చాలా మందికి అసౌకర్యం కలిగించిందని తెలుసుకుని బాధపడ్డాను. ఇది నాకు నాకొక గుణపాఠం నేర్పింది. ఆ అనుభవం నుంచి కొత్త పాఠం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎలాంటి కంటెంట్‌తో నటిస్తున్నానో గమనించి.. మరింత జాగ్రత్తగా ఉంటున్నాను.” అని కేతిక తెలిపింది. ఈ వ్యాఖ్యల ద్వారా కేతికా శర్మ తన పాత్రపై, గతంలో జరిగిన వివాదంపై స్పష్టంగా స్పందిస్తూ.. ప్రస్తుత సినిమాపై మంచి ఆసక్తిని కలిగించింది. ‘సింగిల్’ చిత్రానికి యువతలో మంచి హైప్ ఏర్పడింది.