'కీప్ ది ఫైర్ అలైవ్.. మేల్కొల్పే లఘు చిత్రం!

Update: 2025-03-09 10:35 GMT

లైంగిక వేధింపులపై సున్నితంగా, సమర్థంగా స్పందించేందుకు రూపొందించిన వినూత్న ప్రయత్నమే 'కీప్ ది ఫైర్ అలైవ్'. ఇది కేవలం 1 నిమిషం 25 సెకండ్ల షార్ట్ ఫిల్మ్ అయినా, దీని సందేశం ఎంతో ప్రభావవంతమైనదని టీమ్ చెబుతోంది. ఈ లఘు చిత్రాన్ని ప్రముఖ నటీమణి సంయుక్త సమర్పిస్తుంది. అంతేకాదు.. సంయుక్త ఈ షార్ట్ ఫిల్మ్ కి వాయిస్ ఓవర్ అందించడం వివేషం.




సంయుక్త వాయిస్ ఓవర్ ఈ షార్ట్ ఫిల్మ్‌కి ప్రాణం పోసిందని టీమ్ చెప్పింది. సమాజంలో మార్పు అనివార్యం. అందుకోసం సంయుక్త ‘ఆదిశక్తి’ అనే ఫౌండేషన్‌ను స్థాపించి, మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కూడా అదే దిశగా ఒక అడుగు అని టీమ్ తెలిపింది. 'కీప్ ది ఫైర్ అలైవ్' స్త్రీల భద్రతపై స్పష్టమైన సందేశాన్ని అందిస్తూ, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుందని టీమ్ ఇచ్చిన సందేశం.




 


Tags:    

Similar News