చిరంజీవి నుంచి శ్రీలీలకు ప్రత్యేక గిఫ్ట్!
By : Surendra Nalamati
Update: 2025-03-09 12:29 GMT
చిరంజీవి నుంచి శ్రీలీలకు ప్రత్యేక గిఫ్ట్!మెగాస్టార్ చిరంజీవి నుంచి కిస్సిక్ బ్యూటీ శ్రీలీలకు అరుదైన గిఫ్ట్ అందింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘విశ్వంభర’ సినిమా సెట్స్ పై చిరంజీవిని కలిసిన శ్రీలీల.. ఆ అనుభూతిని ఎంతో ప్రత్యేకంగా ముద్రించుకుంది.
శ్రీలీలను ఆప్యాయంగా హత్తుకున్న చిరంజీవి, ఆమెకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు, ప్రత్యేకంగా దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని బహూకరించి ఆశీర్వదించారు. చిరంజీవి నుంచి ఇలాంటి గిఫ్ట్ అందుకోవడం పట్ల శ్రీలీల ఆనందంతో మునిగిపోయింది.
ఆ ప్రత్యేక క్షణాన్ని మరింత మధురంగా మార్చుకుంటూ, చిరంజీవితో ఓ మెగా సెల్ఫీ తీసుకుని తన హ్యాపీనెస్‌ను అభిమానులతో పంచుకుంది. శ్రీలీల ఇన్‌స్టా స్టోరీస్ లో పంచుకున్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.