బోల్డ్ కేరక్టర్ చేయబోతున్న ‘డ్రాగన్’ గాళ్ ?

కాయదు ఈ సినిమాలో ఒక వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.;

By :  K R K
Update: 2025-07-17 00:37 GMT

కాయదు లోహర్ తాజాగా తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్‌ కు జోడీగా “రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” సినిమాతో తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఆమెను తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ చేసింది. దీంతో ఆమెకు కొత్త ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ కాయదు గట్టిగా రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న “ది ప్యారడైజ్” సినిమాలో ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. అధికారికంగా ఆమె పేరును మేకర్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కాయదు ఈ సినిమాలో ఒక వేశ్య పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది నిజమైతే, ఇది చాలా బోల్డ్ మరియు సవాల్‌తో కూడిన పాత్ర, ఆమె కెరీర్‌లో కీలకమైన మలుపు కావొచ్చు.

ఇలాంటి ఇంటెన్స్, లేయర్డ్ క్యారెక్టర్స్‌ను ఒడిసిపట్టుకోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు ఇది చూపిస్తోంది. గతంలో కాయదు తెలుగులో “అల్లూరి” అనే సినిమాలో నటించింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే, “ది ప్యారడైజ్”లో ఈ రోల్ ఆమెకు తెలుగు సినిమాల్లో గ్రాండ్ రీ-లాంచ్‌గా నిలిచే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో చూడాలి. 

Tags:    

Similar News