అందుకే తెలుగు సినిమాల్లో నటించడం లేదు : కమలినీ ముఖర్జీ
“ఒక సినిమాలో నా పాత్రను చూసిన తర్వాత, అలాంటి రోల్స్ చేయకూడదని అనిపించింది. దర్శకులు నా పాత్ర కథకు అవసరం లేదని భావించి, ఎడిటింగ్‌లో నా సీన్స్‌ను తీసేసే అవకాశం ఉంటే.. అప్పుడు తెలుగు సినిమాల నుండి దూరం కావాలని నిర్ణయించుకున్నాను,”;
ఒకప్పుడు తన అందం, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ కమలినీ ముఖర్జీ. చివరకు ఆమె సినిమాల నుండి దూరం కావడానికి కారణం గురించి స్పష్టం చేసింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “ఆనంద్” సినిమాతో కమలినీ ముఖర్జీ.. అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘స్టైల్, గమ్యం, గోదావరి, గోపీ గోపికా గోదావరి’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. వెంకటేష్‌తో “నాగవల్లి”, నాగార్జునతో “షిర్డీ సాయి” వంటి సీనియర్ స్టార్స్‌తో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది.
కానీ.. 2014లో రామ్ చరణ్‌తో “గోవిందుడు అందరి వాడేలే” సినిమా తర్వాత ఆమె తెలుగు సినిమాలకు సైన్ చేయడం మానేసింది. ఆ తర్వాత కొన్ని మలయాళం, తమిళ సినిమాల్లో కనిపించినా.. ఆమె నిశ్శబ్దంగా సినీ ఇండస్ట్రీ నుండి తప్పుకుంది.
ఇప్పుడు 41 ఏళ్ల వయసులో, కమలినీ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించింది... “ఒక సినిమాలో నా పాత్రను చూసిన తర్వాత, అలాంటి రోల్స్ చేయకూడదని అనిపించింది. దర్శకులు నా పాత్ర కథకు అవసరం లేదని భావించి, ఎడిటింగ్‌లో నా సీన్స్‌ను తీసేసే అవకాశం ఉంటే.. అప్పుడు తెలుగు సినిమాల నుండి దూరం కావాలని నిర్ణయించుకున్నాను,” అని కమలినీ ముఖర్జీ చెప్పింది.