ఐటమ్ సాంగ్స్ హవా మళ్లీ మొదలైంది!

గత నెల రెండు చిత్రాల్లో ఇద్దరు ప్రముఖ నాయికలు తమ కెరీర్‌లో తొలిసారిగా ఐటమ్ సాంగ్స్ చేశారు. కేతికా శర్మ “రాబిన్‌హుడ్‌” చిత్రంలో, రెబా మోనికా జాన్ “మ్యాడ్ స్క్వేర్‌” సినిమాలో ఐటమ్ బాంబులుగా అలరించారు.;

By :  K R K
Update: 2025-04-06 01:12 GMT

తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ జోరు మళ్లీ పెరిగిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలైన “పుష్ప” సిరీస్‌లో సమంత, శ్రీలీల వంటి ప్రముఖ నాయికలు ఐటమ్ సాంగ్స్ లో నటించడం ట్రెండ్‌గా మారింది. యూత్‌ఫుల్ కామెడీ సినిమాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాయి.

కాస్త వెనక్కి వెళితే, గత నెల రెండు చిత్రాల్లో ఇద్దరు ప్రముఖ నాయికలు తమ కెరీర్‌లో తొలిసారిగా ఐటమ్ సాంగ్స్ చేశారు. కేతికా శర్మ “రాబిన్‌హుడ్‌” చిత్రంలో, రెబా మోనికా జాన్ “మ్యాడ్ స్క్వేర్‌” సినిమాలో ఐటమ్ బాంబులుగా అలరించారు. ఈ రెండు సినిమాల ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి.

సమంత చేసిన "ఊ అంటావా మావా" పాటను తొలుత కేతికా శర్మ చేయాల్సిందిగా ప్లాన్ చేశారు. కానీ ఆ ఛాన్స్ సమంతకు వెళ్లింది. ఆ పాట దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అందుకే, కేతికాకు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు “రాబిన్‌హుడ్” చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో ఆమెను నటింపజేశారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రంలో ఈ పాట విడుదలకు ముందే వైరల్ అయింది. అయితే కొన్ని అభ్యంతరకర నృత్య శైలులపై విమర్శలు రావడంతో, చిత్రబృందం ఫిల్మ్ వెర్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. అయినప్పటికీ, కేతికా శర్మ చూపించిన గ్లామర్ సినిమాలో బాగానే పేలింది.

ఇంకొవైపు.. రెబా మోనికా జాన్ మాత్రం తొలి సారి చేసిన ఐటమ్ సాంగ్ తోనే హిట్టయ్యింది. “మ్యాడ్ స్క్వేర్” చిత్రంలోని “స్వాతి రెడ్డి” పాట ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. మొదటి వీకెండ్‌లోనే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో రెబా మోనికా జాన్‌కు ఇకపై ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు రావచ్చని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.


Tags:    

Similar News