కోలీవుడ్ రాక్‌స్టార్ టాలీవుడ్ ఫేవరెట్ అవుతున్నాడా?
టాలీవుడ్‌లో అనిరుధ్ ప్రయాణం ఆసక్తికరంగా మారుతోంది. ఒకప్పుడు తెలుగు వాళ్లకు అతని కాల్షీట్లు దొరకడమే కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు తమిళం కంటే మిన్నగా తెలుగుకే ప్రయారిటీ ఇస్తున్నాడు. మరోవైపు వర్క్ విషయంలోనూ అనుకున్న సమయానికి అవుట్‌పుట్ ఇస్తున్నాడనే ప్రశంసలు దక్కించుకుంటున్నాడు.
లేటెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' టీజర్ విషయంలో అనిరుధ్ మార్క్ స్పష్టంగా కనిపించింది. 'కింగ్‌డమ్' టీజర్ కు అనిరుధ్ ఇచ్చిన నేపథ్య సంగీతానికి మంచి స్పందన వచ్చింది. సేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మరో చిత్రం 'మ్యాజిక్'ని మ్యూజికల్ గా ఓ రేంజులో తీర్చిదిద్దుతున్నాడట అనిరుధ్. 'మ్యాజిక్' సినిమా ఆద్యంతం మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం. ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజయ్యింది.
ఇక నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' టీజర్ మార్చి 3న విడుదల కానుంది. 'ది ప్యారడైజ్' టీజర్ కి అనిరుధ్ అందించిన బి.జి.ఎమ్. అదుర్స్ అంటున్నారు. దీనికి తోడు అనిరుధ్ తెలుగులో మరిన్ని ప్రాజెక్టులలో భాగం కాబోతున్నాడని టాక్. చిరంజీవి - ఓదెల, బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాల కోసం కూడా అనిరుధ్ సంగీతం సమకూర్చనున్నాడట. తమిళంలో అయితే విజయ్ ‘జన నాయగన్’, రజినీకాంత్ ‘కూలి, జైలర్ 2 ’, శివ కార్తికేయన్ ‘మదరాసి’, కమల్ హాసన్ ‘ఇండియన్ 3' వంటి ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.