సితార బ్యానర్‌లో కాయదు – గోల్డెన్ ఛాన్స్!

Update: 2025-02-28 04:32 GMT

కాయదు లోహర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. గతంలో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘అల్లూరి’ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. లేటెస్ట్ గా ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’తో టాలీవుడ్ లో హిట్ కొట్టింది. ఈ హిట్‌తో కాయదు లోహార్‌ పై పలువురు దర్శకనిర్మాతలు దృష్టి పెట్టారు.

ఈకోవలోనే లేటెస్ట్ గా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా మాత్రమే కాదు.. తెలుగులో మరికొన్ని ఆఫర్స్ కాయదు కోసం వేచి చూస్తున్నాయట. అయితే ఈ అమ్మడు మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

అదృష్టం కలిసి వస్తే కాయదు లోహర్‌కి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కూడా దక్కొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమిళంలో ‘ఇదయం మురళి’ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల వచ్చిన ఈ మూవీ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. మొత్తంగా.. విశ్వక్ సేన్ ‘ఫంకీ’ కాయాదుకు టాలీవుడ్‌లో నిలదొక్కుకునే సినిమా అవుతుందా? వేచి చూడాలి!

Tags:    

Similar News