‘ఘాటీ’ విడుదలయ్యేది అప్పుడేనా?

తాజా సమాచారం ప్రకారం.. "ఘాటి" సినిమా ఈ సంవత్సరం జూన్ చివర లేదా జూలైలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-04-29 00:37 GMT

అందాల అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతున్న డ్రామా మూవీ "ఘాటి". ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంజాయి సాగు, స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన చిత్రంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. మొదట ఏప్రిల్ 18న సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్ . అయితే కొన్ని కారణాలతో సినిమా విడుదలను మేనెలకు వాయిదా వేశారు. అయితే ఇప్పటి వరకు విడుదల తేదీపై మళ్లీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజా సమాచారం ప్రకారం.. "ఘాటి" సినిమా ఈ సంవత్సరం జూన్ చివర లేదా జూలైలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్స్ పూర్తి కాలేదన్న కారణంతో సినిమా విడుదల ఆలస్యమవుతోంది. ఈ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపించనుండగా, తమిళ నటుడు విక్రమ్ ప్రభు "దేశీ రాజు" పాత్రలో కనిపించబోతున్నారు.

దర్శకుడు క్రిష్ ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నారు. ఆయన గత చిత్రం "కొండపొలం" బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. పైగా, ఆయన పవన్ కల్యాణ్ నటిస్తున్న "హరిహర వీరమల్లు" ప్రాజెక్ట్ నుండి సగంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో క్రిష్ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే "ఘాటి" సినిమా విజయవంతం కావడం అత్యవసరం. ప్రస్తుతం అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాలు ఈ చిత్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారిక విడుదల తేదీపై త్వరలో స్పష్టత రావాలని ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News