సినీ కార్మికులతో కోమటిరెడ్డి

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె పరిస్థితి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.;

By :  S D R
Update: 2025-08-11 05:57 GMT

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మె పరిస్థితి పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. వేతనాల పెంపు డిమాండ్‌తో కార్మిక సంఘాలు సమ్మె చేపట్టగా, నిర్మాతల మండలి (ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) మరియు ఫిలిం ఛాంబర్ పక్షాన పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ పూర్తి స్థాయి ఒప్పందం కుదరకపోవడంతో చిత్ర నిర్మాణాలు, షూటింగ్‌లు దాదాపు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేనికి మంత్రి ఫోన్ చేసి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కార్మిక సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశాన్ని సూచించారు.

కార్మికులు ప్రతిరోజు తీసుకునే వేతనాలను కనీసం 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు మొదటి ఏడాది 15 శాతం, రెండవ ఏడాది 5 శాతం, మూడవ ఏడాది 5 శాతం పెంపు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై ఫెడరేషన్ సంతృప్తి చెందకపోవడంతో సమ్మె కొనసాగుతోంది.

Tags:    

Similar News