‘పెద్ది’ కోసం అదిరిపోయే విజయనగరం సెట్ !
హైదరాబాద్ శివార్లలో విజయనగరం పట్టణాన్ని ఒక లైవ్ రెప్లికాగా తీర్చిదిద్దుతున్నారు. ఇది కేవలం సెట్ అని అనుకోకండి. ఇందులో రోడ్లు, రైల్వే స్టేషన్, 80ల నాటి వైబ్‌ని గుర్తుకు తెచ్చే స్పోర్ట్స్ స్టేడియం కూడా ఉన్నాయి.;
టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా రూపొందుతోంది రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబో మూవీ ‘పెద్ది’. 1980ల గ్రామీణ నేపథ్యంలో మాస్ అప్పీల్‌ని టచ్ చేస్తూనే సబ్‌స్టాన్స్‌ని ఆఫర్ చేసేలా ఈ మూవీ స్టో్రీ డిజైన్ చేయబడింది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక ఫైర్‌బ్రాండ్ గ్రామీణ హీరోగా కనిపించనున్నాడు. మాస్ ఆడియన్స్‌ని ఊపేసే పాత్రలో, డెప్త్‌తో కూడిన పెర్ఫార్మెన్స్‌ని అందించే స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లా కనిపిస్తోంది.
ప్రొడక్షన్ విషయానికొస్తే.. ఇది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. హైదరాబాద్ శివార్లలో విజయనగరం పట్టణాన్ని ఒక లైవ్ రెప్లికాగా తీర్చిదిద్దుతున్నారు. ఇది కేవలం సెట్ అని అనుకోకండి. ఇందులో రోడ్లు, రైల్వే స్టేషన్, 80ల నాటి వైబ్‌ని గుర్తుకు తెచ్చే స్పోర్ట్స్ స్టేడియం కూడా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఈ భారీ సెట్‌ని లీడ్ చేస్తున్నాడు. ప్రతి డిటైల్.. ఒక్కో ఇటుక, ఒక్కో గోడ.. ఆ ఎరా ఫీల్‌ని రీక్రియేట్ చేసేలా జాగ్రత్తగా ప్లాన్ చేయబడింది. ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే.. ఈ మూవీ కోసం మొదట రూ. 250 కోట్లుగా అంచనా వేసిన బడ్జెట్ ఇప్పుడు రూ. 300 కోట్లు దాటేసింది.
నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని రూ. 105-110 కోట్ల రేంజ్‌లో సొంతం చేసుకుందని బజ్. ఇది తెలుగు సినిమాల్లో టాప్ ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, నెట్‌ఫ్లిక్స్ కేవలం రైట్స్ తీసుకోవడం మాత్రమే కాదు, సినిమా ప్లానింగ్, మార్కెటింగ్‌లో కూడా క్రియాత్మకంగా ఇన్వాల్వ్ అవుతోందని టాక్. వచ్చే ఏడాది మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల కాబోతోంది. ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ మొదలెట్టేశారు.
జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ యాక్టర్ జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ.. కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం విషయంలో ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ మ్యాజిక్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్రాక్‌లు రెడీ చేశాడట. మొత్తానికి ‘పెద్ది’ మూవీ విషయంలో ఇప్పుడు అందరి ఫోకస్ హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న ఆ విజయనగరంపైనే. అది కృత్రిమమైనా, రియల్ వైబ్‌ని క్రియేట్ చేస్తోంది.