శర్వా 38 లో ‘ఖిలాడి’ బ్యూటీ
ఈ చిత్రంలో ఇటీవల అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ప్రకటించగా.. తాజాగా ‘ఖిలాడి’ బ్యూటీ డింపుల్ హయాతీ కూడా ప్రధాన పాత్రలో జాయిన్ అయ్యారు.;
శర్వానంద్ కెరీర్ లో 38వ సినిమా గా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇటీవల అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ప్రకటించగా.. తాజాగా ‘ఖిలాడి’ బ్యూటీ డింపుల్ హయాతీ కూడా ప్రధాన పాత్రలో జాయిన్ అయ్యారు.
మేకర్స్ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. డింపుల్ హయాతీ ఈ సినిమాలో "రూల్స్ బ్రేక్ చేసే" పాత్రలో కనిపించనుంది. "రస్టిక్ ప్రపంచానికి మంటలు రేపడానికి డింపుల్ హయాతీ వచ్చింది. అన్ని అంచనాలను అధిగమించే పాత్రలో ఆమెను స్వాగతిస్తున్నాం," అంటూ మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది.
డింపుల్ హయాతీ గతంలో "గద్దలకొండ గణేశ్" , "అత్రంగి రే" వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి "ఖిలాడి" చిత్రంలో రవితేజతో, "రామబాణం" చిత్రంలో గోపిచంద్‌తో జోడీ కట్టింది. అయితే ఈ రెండు సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఆమె కెరీర్‌కు తాత్కాలికంగా వెనుకడుగు పడింది. "రామబాణం" విడుదలైన తర్వాత డింపుల్ కు అవకాశాలు దక్కలేదు.
అయితే తాజాగా.. ఈ మూవీ ప్రకటనకి కొద్దిరోజుల ముందు, డింపుల్ హయాతీ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోషూట్ తెగ వైరల్ అయింది. సాధారణంగా కంటే మరింతగా గ్లామర్ చూపిస్తూ చేసిన ఈ ఫోటోషూట్ ఆమెపై మళ్లీ ఫోకస్ పెరిగేలా చేసింది. ఇప్పుడు శర్వా 38 సినిమా ద్వారా ఆమె కెరీర్ మరోసారి ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.