డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’
ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షణ్ముఖ’. డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అవికా గోర్ కథానాయికగా అలరించనుంది. షణ్ముగం సప్పని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాప్ బ్రో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మించారు. మార్చి 21న విడుదలకు ముస్తాబైన ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఒక ధైర్యవంతుడైన పోలీస్ అధికారిగా ఆది సాయికుమార్ కనిపిస్తున్నాడు. ఆది, అవికా మధ్య లవ్ స్టోరీతో పాటు డివోషనల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమా ఆది సాయి కుమార్ కెరీర్ లో ఆసక్తికరమైన మైలురాయిగా నిలుస్తుందేమో చూడాలి.