ఈ కాంబో నిజమేనా?
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత నాని కలిపి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కోసం భారీ కలలు కంటున్నారని టాక్. తొలుత రాణి ముఖర్జీ పేరును పరిశీలించినట్టు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం దీపికా పదుకొనే పేరు చర్చల్లో ఉందట.;
సౌత్ స్టార్‌డమ్‌కి బాలీవుడ్ గ్లామర్ యాడ్ అయితే , అభిమానులలో ఆనందం ఉప్పొంగిపోతుంది. ఇప్పుడు అలాంటి సందర్భమే తెరపైకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జోడీగా నటిస్తోందనే ఊహాగానాలు మొదలవటంతో సోషల్ మీడియాలో సంచలనం నెలకొంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ఆగస్టు 22న విడుదలకు సిద్ధమవుతుండగా... అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార కథానాయికగా ఓ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఈ నేపథ్యంలో చిరు-దీపిక జంటపై వినిపిస్తున్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత నాని కలిపి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా కోసం భారీ కలలు కంటున్నారని టాక్. తొలుత రాణి ముఖర్జీ పేరును పరిశీలించినట్టు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం దీపికా పదుకొనే పేరు చర్చల్లో ఉందట. దీపికా ఇప్పటికే ‘కల్కి 2898 AD 2’ లాంటి భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయినా, చిరంజీవి సరసన నటిస్తే అది ఆమె దక్షిణాదిలోని నటనా ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.
ప్రబాస్‌తో ‘కల్కి’ సినిమా ద్వారా దీపికా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనప్పటికీ చిరుతో స్క్రీన్ షేర్ చేయడం పూర్తి భిన్నమైన అనుభూతి అవుతుంది. ఈ కలయిక నిజంగా నిజమైతే, ఇది ఇండియన్ సినిమాకే పెద్ద ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరి… ఈ జంట తెరపైకి వస్తుందా? వేచి చూడాలి!