బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న ‘కోర్ట్’
హీరో నాని నిర్మాతగా, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ బాక్సాఫీస్ వద్ద విజయం దిశగా దూసుకెళ్తుంది. రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హోలీ సందర్భంగా మార్చి 14న విడుదలై, తొలి రోజే మంచి స్పందనను తెచ్చుకుంది.
ప్రీమియర్ షోలతో కలిపి మొదటిరోజు ఈ చిత్రం రూ. 8.10 కోట్లు రాబట్టింది. ప్రియదర్శి కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది టీమ్. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం డిజిటల్ హక్కుల రూపంలోనూ నానికి లాభాలను తీసుకొచ్చిందట.
పోక్సో చట్టం నేపథ్యంలో కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్‌లో కోర్టు చట్టాల నేపథ్యంతో వచ్చిన కథలు ఎక్కువగా లేవు. ముఖ్యంగా ఈ సినిమాతో శివాజీకి మంచి కంబ్యాక్ లభించింది. ఓవరాల్‌గా చూస్తే ‘కోర్ట్’ సినిమా టాలీవుడ్‌లో కోర్ట్ డ్రామాలకు కొత్త ఊపునిచ్చే విధంగా నిలిచింది.