క్లైమాక్స్ షూట్ సన్నాహాల్లో ‘పెద్ది’

నెక్స్ట్ షెడ్యూల్ నాసిక్‌లో లాక్ చేశారు. అక్కడ కొన్ని కీలక సీన్స్ షూట్ చేయబోతున్నారు. కానీ అసలు హైలైట్ ఏంటంటే... క్రికెట్ సీక్వెన్సెస్. ముఖ్యంగా క్లైమాక్స్‌ని భారీ స్కేల్‌లో, ఫుల్ క్రౌడ్ సెటప్‌తో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.;

By :  K R K
Update: 2025-07-07 11:42 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త స్పోర్ట్స్ డ్రామా పెద్ది షూటింగ్ ఇదివరకే బిగిన్ అయిపోయిన సంగతి తెలిసిదే. ప్రస్తుతం సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్న ఓ రైల్వే స్టేషన్‌లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి లెజెండరీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బ్యాక్‌డ్రాప్‌గా ఉంది. సైలెంట్‌గా మొదలైన ఈ మూవీ ఇప్పటికే ఇండస్ట్రీలో, ఫ్యాన్స్‌లో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. నెక్స్ట్ షెడ్యూల్ నాసిక్‌లో లాక్ చేశారు. అక్కడ కొన్ని కీలక సీన్స్ షూట్ చేయబోతున్నారు. కానీ అసలు హైలైట్ ఏంటంటే... క్రికెట్ సీక్వెన్సెస్. ముఖ్యంగా క్లైమాక్స్‌ని భారీ స్కేల్‌లో, ఫుల్ క్రౌడ్ సెటప్‌తో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.

రామ్ చరణ్ ఈ మూవీలో స్మాల్-టౌన్ క్రికెటర్‌గా కనిపించబోతున్నాడు. ప్రొడక్షన్ టీమ్ ఈ క్రికెట్ వరల్డ్‌ని గ్లాసీగా కాకుండా, రా ఎనర్జీ, గ్రిట్‌తో రియలిస్టిక్‌గా రీ-క్రియేట్ చేయడానికి ఫుల్ ఫోకస్‌లో ఉంది. ఇది కేవలం స్పోర్ట్స్ డ్రామా కాదు. ఎమోషనల్ జర్నీ కూడా అని టీమ్ స్పష్టం చేస్తోంది. ఈ మూవీ స్పెషల్ ఏంటంటే.. ఇది టిపికల్ ఫ్లాషీ స్పోర్ట్స్ ఫిల్మ్ కాదు. మేకర్స్ దీన్ని రియల్, రిలేటబుల్, అదే సమయంలో పవర్‌ఫుల్‌గా తీసుకొస్తున్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి ఇప్పటికే ఇన్‌సైడర్స్ నుంచి బజ్ లీక్ అవుతోంది. సాంగ్స్ కేవలం బ్యాక్‌గ్రౌండ్ ఫిల్లర్స్ కాదు, స్టోరీలో డీప్‌గా ఇన్‌వాల్వ్ అయ్యేలా, ఎమోషనల్‌గా, ఎనర్జీతో హిట్ చేసేలా ఉంటాయట. ముఖ్యంగా క్రికెట్ మూమెంట్స్‌లో ఈ సాంగ్స్ గేమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయని టాక్.

రెహమాన్ మ్యాజిక్ ఈ సినిమాకి హార్ట్‌బీట్ అవుతుందని అంటున్నారు. పెద్దికి సోషల్ మీడియాలో భారీ హైప్ కోసం చూడడం లేదు . సైలెంట్‌గా, క్లియర్ విజన్‌తో, పక్కా ఇంటెంట్‌తో ముందుకు సాగుతోంది. స్టోరీ, క్రికెట్ సీన్స్, రెహమాన్ మ్యూజిక్, రామ్ చరణ్ ఫుల్ ఫామ్‌లో ఒక్కటైతే.. ఈ స్పోర్ట్స్ డ్రామా జస్ట్ హిట్ కాదు, టోటల్‌గా డిఫరెంట్ లెవెల్‌లో కనెక్ట్ అయ్యే పొటెన్షియల్ ఉంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్, ఇన్‌స్పిరేషనల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందని ఫ్యాన్స్ ఆల్రెడీ తెగ ఎక్సయిట్ అవుతున్నారు.

Tags:    

Similar News