తెలుగులోనూ ‘ఛావా‘ వసూళ్ల గర్జన!
భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాలను ఆదరించడంలో తెలుగు వారు ఎప్పుడూ ముందుంటారు. ఈకోవలోనే ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఛావా‘కి అనూహ్యమైన స్పందన దక్కుతుంది. విడుదలైన ఐదు రోజులకే ఈ చిత్రం రూ.11.91 కోట్లు వసూళ్లను కొల్లగొట్టింది. ఈ శుక్రవారం వరకూ తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోవడంతో ‘ఛావా‘ వసూళ్లకు ఢోకా లేదు.
మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ముందుగా హిందీలో మాత్రమే విడుదలయ్యింది. ఆశ్చర్యకరంగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎద్దున డిమాండ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు మంచి వసూళ్లతో ‘ఛావా‘ తెలుగులోనూ హిట్ గా నిలిచింది. మరోవైపు ఏప్రిల్ 11 నుంచి ‘ఛావా‘ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం జరుగుతుంది.