తెలుగులో 'ఛావా' గర్జన.. ట్రైలర్ విడుదల!
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రక చిత్రం ‘ఛావా’ మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
గత నెలలో హిందీలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్న 'ఛావా' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పిస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ భారీ స్థాయిలో విడుదల చేస్తుంది.
తాజాగా 'ఛావా' తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్. శంభాజీ మహారాజ్ జీవితం, ఆయన వీరోచిత యుద్ధాలు ఈ ట్రైలర్ లో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ ను చూస్తే 'ఛావా' తెలుగు అనువాదం గురించి గీతా ఆర్ట్స్ ఎక్కువ శ్రద్ధ తీసుకున్నట్టు అనిపిస్తుంది. మరి.. తెలుగులోనూ 'ఛావా' భారీ విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.