రామ్ తో ఫిక్సైన చందూ మొండేటి?
By : Surendra Nalamati
Update: 2025-03-13 14:36 GMT
‘కార్తికేయ 2, తండేల్‘ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్స్ అందుకున్నాడు డైరెక్టర్ చందూ మొండేటి. ఇక ‘తండేల్‘ విజయం తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేయబోతున్నాడట చందూ. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ఒక చిత్రానికి సన్నాహాలు సైతం మొదలు పెట్టాడు. కానీ.. ఇప్పట్లో సూర్య డేట్స్ దొరకడం అంటే కష్టమే. అందుకే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఇటీవలే రామ్ ను కలిసి చందూ మొండేటి కథను వివరించినట్లు తెలుస్తోంది. రామ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి చూపించడంతో, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. మరోవైపు రామ్ తన 22వ సినిమాతో బిజీగా ఉన్నాడు.