బ్రేక్ ఈవెన్ ను సాధించిన ‘కిష్కింధపురి’

సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన "కిష్కింధాపురి" మంగళవారం నాటికి అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మంగళవారం అయినప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దృఢంగా నిలిచి.. స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది.;

By :  K R K
Update: 2025-09-17 00:37 GMT

టాలీవుడ్ యంగ్ డైనమైట్ బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కాలం తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్‌పైకి వచ్చాడు. ఇటీవలి అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ, "కిష్కింధపురి" అతనికి ఊరట కలిగించింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన "కిష్కింధాపురి" మంగళవారం నాటికి అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. మంగళవారం అయినప్పటికీ.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దృఢంగా నిలిచి.. స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌కు చాలా సంవత్సరాల తర్వాత బ్రేక్ ఈవెన్ మార్క్‌ను అందుకున్న తొలి చిత్రం ఇది. సాహు గారపాటి నిర్మాణంలో, బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "కిష్కింధపురి" ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ ఊపుతో "కిష్కింధపురి" ఇప్పుడు లాభాల దిశగా దూసుకెళ్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ, విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ సమీక్షలు వచ్చాయి, అయితే సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ప్రత్యేకంగా మంచి ఆదరణ లభించింది. ఆసక్తికరంగా, ఇది బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా హిట్ అయిన రెండో చిత్రం. గతంలో వీరిద్దరూ జోడీగా నటించిన "రాక్షసుడు" కూడా విజయం సాధించింది.

అనుపమ పరమేశ్వరన్‌కు కూడా "కిష్కింధపురి" ఊరటనిచ్చింది. ముఖ్యంగా ఆమె నటించిన ఈ తొలి లేడీ ఓడియెంటెడ్ తెలుగు చిత్రం "పరదా".. బాక్సాఫీస్ వద్ద విఫలమైన తర్వాత.. ఈ విజయంతో, ఆమె ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌లను మరింత ఆత్మవిశ్వాసంతో.. పాజిటివ్ మైండ్‌సెట్‌తో చేపట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News