‘మార్కో’ దర్శకుడితో బాలయ్య మార్క్ మూవీ?
హనీఫ్ తన వైలెంట్ యాక్షన్ డ్రామా 'మార్కో' తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. వీరిద్దరూ హై-ఓక్టేన్ కాప్ డ్రామాపై వర్క్ చేస్తున్నారని, బాలయ్యను ఫీర్స్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో చూపించే అవకాశం ఉందని టాక్.;
నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఇటీవల భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అయినా, ఆయన జోరు తగ్గడం లేదు. హిందూపురంలో తన అభిమానులతో ఈ గౌరవాన్ని జరుపుకుంటూ.. బాలకృష్ణ తన సినీ కెరీర్ గురించి మాట్లాడారు. "అందరూ నా వరుసగా నాలుగు హిట్స్ తర్వాత ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు, కానీ నిజమైన సెకండ్ ఇన్నింగ్స్ 'అఖండ 2'తో మొదలవుతుంది. ఇది అందరి అంచనాలను మించిపోతుంది," అని ఆయన ధీమాగా చెప్పారు.
పాండమిక్‌కు ముందు కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్న బాలయ్య.. బోయపాటి శ్రీనుతో చేసిన తన మూడో బ్లాక్‌బస్టర్ 'అఖండ' తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో 'వీర సింహా రెడ్డి', అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి', ఆపై బాబీ కొల్లితో 'డాకు మహారాజ్' వంటి హిట్స్‌తో యువతకు మరింత చేరువయ్యారు. ఆయన టాక్ షో 'అన్‌స్టాపబుల్' ఆయన ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది, 60 ఏళ్ల వయసులోనూ ఆయన బహుముఖ ప్రతిభను చాటింది.
'అఖండ 2'తో బాలయ్య పాన్-ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ బహుళ భాషల్లో డబ్ అవుతూ, దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ కానుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్-లుక్ టీజర్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్‌ను బాలయ్యతో కన్ఫామ్ చేశారు, ఇది 'వీర సింహా రెడ్డి'ని మించిన స్కేల్‌లో ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాలకృష్ణ మలయాళ డైరెక్టర్ హనీఫ్ అదేనితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. హనీఫ్ తన వైలెంట్ యాక్షన్ డ్రామా 'మార్కో' తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు. వీరిద్దరూ హై-ఓక్టేన్ కాప్ డ్రామాపై వర్క్ చేస్తున్నారని, బాలయ్యను ఫీర్స్ అండ్ ఇంటెన్స్ రోల్‌లో చూపించే అవకాశం ఉందని టాక్. బాలయ్యను ఓ స్టైలిష్ యాక్షన్ మూవీతో ప్రెజెంట్ చేసే ఉద్దేశంతో ఉన్నాడు హనీఫ్. మరి దానికోసం అతడు ఎలాంటి కథాంశం ఎంపిక చేసుకుంటాడో చూడాలి.