ఆస్క్ మీ ఎనీ థింగ్ : సమంత

Update: 2025-02-25 09:30 GMT

లేటెస్ట్ గా అందాల నటి సమంతా రుత్ ప్రభు తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో "ఆస్క్ మీ ఎనీ థింగ్" సెషన్ ద్వారా ముచ్చటించింది. ఈ సందర్బంగా.. ఒక అభిమాని ఆమె అంతర్గతంగా ఎదుర్కొనే ప్రతికూల ఆలోచనలను ఎలా నియంత్రించుకుంటుందో అడిగాడు. దీనికి సమంతా గత ఏడాది పోస్ట్ చేసిన ఒక రీల్‌ను సూచిస్తూ ఒక వీడియో షేర్ చేసింది.

తను ప్రతిరోజు దినచర్యలో సూర్యకాంతిని ఆస్వాదించడం, కృతజ్ఞతాపూర్వకంగా డైరీ రాయడం, ధ్యానం చేయడం, ఇంకా మరికొన్ని అభ్యాసాలను పాటించడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గే సందర్భాల్లో అవి తనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పింది. సినిమాల విషయానికొస్తే .. ఆమె ప్రస్తుతం "రక్త బ్రహ్మాండ్" అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అదే చాట్ సెషన్‌లో.. తాను తిరిగి తెలుగు సినిమాల్లో నటించబోతున్నట్లు తెలిపింది. త్వరలో తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానని కూడా వెల్లడించింది.

Tags:    

Similar News