'పెద్ది' నుంచి శివన్న లుక్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. 'రంగస్థలం' తర్వాత చరణ్ మరోసారి రా & రస్టిక్ విలేజ్ లుక్ లో కనిపించబోతున్న సినిమా ఇది.;

By :  S D R
Update: 2025-07-12 12:07 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. 'రంగస్థలం' తర్వాత చరణ్ మరోసారి రా & రస్టిక్ విలేజ్ లుక్ లో కనిపించబోతున్న సినిమా ఇది. ఆద్యంతం పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ ఎమోషనల్ డ్రామా ఇప్పటికే భారీ అంచనాలు సెట్ చేసింది.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈరోజు (జులై 12) శివన్న పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఆయన లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ‘గౌర్నాయుడు’ పాత్రలో శివన్న కనిపించబోతున్నాడు. ఈ పోస్టర్ లో ఆయన లుక్ గంభీరంగా కనిపిస్తుంది.

వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. 2026 మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.




Tags:    

Similar News