రవితేజకు జోడీగా ఈ కన్నడ బ్యూటీ ?

ఆమెకు తెలుగు సినిమాల్లో భారీ బ్రేక్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆమె రెండో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం.;

By :  K R K
Update: 2025-06-05 01:36 GMT

కన్నడ అందాల భామ .. అషికా రంగనాథ్.. రెండేళ్ల క్రితం అక్కినేని నాగార్జున పీరియడ్ యాక్షన్ డ్రామా ‘నా సామి రంగ’ తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందులో ఆమె వరలక్ష్మి పాత్రలో తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు.. ఆమెకు తెలుగు సినిమాల్లో భారీ బ్రేక్ దక్కింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఆమె రెండో హీరోయిన్‌గా ఎంపికైందని సమాచారం.

ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు. ఇది రవితేజతో ఆయన మొదటి కలయిక. ఇప్పటికే సింగిల్ సినిమా హీరోయిన్ కేతికా శర్మ ఒక హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. అషికా ఎంట్రీతో ఈ సినిమాకు మరింత గ్లామర్, చార్మ్ జోడవనుంది. ‘నా సామి రంగ’ మూవీలో ఆమె నటన చూసి మెచ్చినవారు, రవితేజతో ఆమె ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అషికా పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. షూటింగ్ జూన్‌లో మొదలవనుంది. ఇది ఆమె తెలుగు కెరీర్‌లో పెద్ద బ్రేక్ కానుంది. ఇక అషికా విషయానికొస్తే, ఆమె మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీలో చిన్న పాత్రలో, అలాగే కన్నడ చిత్రం ‘గతవైభవ’ లోనూ, కార్తి హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’ లోనూ నటిస్తోంది.

Tags:    

Similar News