రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్!
రవి తేజ కొత్త సినిమాలో నటించడానికి ఆషికా రంగనాథ్ ఓకే చెప్పింది. సీనియర్ హీరోలతో నటించడం తనకెంతో ప్రివిలేజ్ అని, గొప్ప నటులతో పనిచేసే అవకాశం దక్కిందని ఆషికా చెబుతోంది.;
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ టాలీవుడ్‌లో మంచి కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటోంది. తనకంటే చాలా సీనియర్ అయిన స్టార్ హీరోల పక్కన ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది. 30 ఏళ్లు కూడా లేని ఆషికా... దశాబ్దాల గ్యాప్ ఉన్న సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. రీసెంట్‌గా ఆమె 66 ఏళ్ల నాగార్జునకు జోడీగా “నా సామి రంగ”లో నటించింది.
ప్రస్తుతం 70 ఏళ్ల మెగాస్టార్ చిరంజీవితో “విశ్వంభర”లో నటిస్తోంది ఆషిక. ఈ జాబితాలో ఇప్పుడు 57 ఏళ్ల రవి తేజ కూడా చేరాడు. రవి తేజ కొత్త సినిమాలో నటించడానికి ఆషికా రంగనాథ్ ఓకే చెప్పింది. సీనియర్ హీరోలతో నటించడం తనకెంతో ప్రివిలేజ్ అని, గొప్ప నటులతో పనిచేసే అవకాశం దక్కిందని ఆషికా చెబుతోంది. ఆమె తన కన్నడ సినిమా “గత వైభవ” ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కొత్త సినిమా గురించి చెప్పింది.
కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందట. ఈ సినిమా భార్యాభర్తల రిలేషన్‌షిప్ డైనమిక్స్ చుట్టూ తిరిగే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఈ ఫన్-ఫిల్డ్ డ్రామా 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే.. వచ్చే ఏడాది ఆషికా రంగనాథ్ నుంచి రెండు పెద్ద తెలుగు సినిమాలు రాబోతున్నాయన్నమాట.