‘హిట్ 3’ కోసం టికెట్ ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 30 ఒక జీవో ద్వారా ‘హిట్ 3’ సినిమా టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచేందుకు అనుమతి మంజూరు చేసింది. ఒక వారం పాటు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉంటాయి.;

By :  K R K
Update: 2025-04-30 10:07 GMT

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేసు’ మే 1 న అంటే రేపే థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని స్వయంగా నిర్మించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 30 ఒక జీవో ద్వారా ‘హిట్ 3’ సినిమా టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచేందుకు అనుమతి మంజూరు చేసింది. ఒక వారం పాటు మాత్రమే ఈ ధరలు అమల్లో ఉంటాయి.

సింగిల్ స్క్రీన్‌లకు రూ. 50 (జీఎస్టీతో సహా)

మల్టీప్లెక్సులకు రూ. 75 (జీఎస్టీతో సహా)

పెరుగుతాయి. ఆ తరువాత టికెట్ ధరలు మళ్లీ సాధారణ స్థాయికి వస్తాయి.

అయితే, హిట్ 3 మూవీ యూనిట్ తెలంగాణ ప్రభుత్వాన్ని టికెట్ ధరలు పెంచాలని కోరనట్టుగా సమాచారం. ఇటీవల సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎలాంటి టికెట్ ధరల పెంపు ఉండదని. టూరిజం శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలు యథాతథంగా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో, హిట్ 3 మూవీకి టికెట్ ధరలు పెరుగుదల లభించిన రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలు పాటించబడుతున్నాయి.

Tags:    

Similar News