అనసూయకు మళ్లీ కోపం తెప్పించారు !

తన ధైర్యసాహసాలతో.. నేరుగా స్పందించే స్వభావంతో గుర్తింపు పొందిన అనసూయ, ఈ వేడుకలో ఓ అభిమాని తనను "ఆంటీ" అని పిలవడంతో ఆగ్రహానికి గురయింది.;

By :  K R K
Update: 2025-03-16 03:51 GMT
అనసూయకు మళ్లీ కోపం తెప్పించారు !
  • whatsapp icon

హైదరాబాద్‌లో జరిగిన హోళీ వేడుకల్లో పాల్గొన్న అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన ధైర్యసాహసాలతో.. నేరుగా స్పందించే స్వభావంతో గుర్తింపు పొందిన అనసూయ, ఈ వేడుకలో ఓ అభిమాని తనను "ఆంటీ" అని పిలవడంతో ఆగ్రహానికి గురయింది. వివరాల్లోకి వెళితే, ఆ అభిమాని అనుకోకుండా లేదా సరదాగా ఆ పదాన్ని ఉపయోగించినట్లుగా భావించవచ్చు.

అయితే, వయస్సును అవహేళన చేసే పదాలపై అనసూయ గతంలోనే తన అసంతృప్తిని పలుమార్లు వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనూ ఆమె సహించలేక, వెంటనే గట్టిగా స్పందించింది. ‘నన్ను రెచ్చగొడితే, నేను ఏమి చేయగలనో చూపిస్తా! ధైర్యం ఉంటే స్టేజీపైకి రా’ అని ఆ ఆకతాయికి సమాధానం చెప్పింది. ఇప్పటి వరకు అనసూయ తనను అవమానించే వ్యాఖ్యలపై ఎన్నోసార్లు ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పింది. సోషల్ మీడియాలోనూ, బహిరంగ వేదికలపైనూ ట్రోలింగ్‌ను గట్టిగా తిప్పికొట్టిన అనుభవం ఆమెకు ఉంది.

ఇద్దరు పిల్లల తల్లిగా, ప్రముఖ నటి, వ్యాఖ్యాతగా ఆమె తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నారు. మహిళల హక్కుల గురించి గళమెత్తే అనసూయ, తనపై వచ్చే విమర్శలకు ఎప్పుడూ తగ్గకుండా నిలబడి సమాధానం ఇచ్చే ధైర్యసాహసాల కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నారు.

Tags:    

Similar News