అల్లు అర్జున్ - బాసిల్ జోసెఫ్...వాటే కాంబో!
అల్లు అర్జున్, మలయాళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ టాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో కొత్త సినిమా కోసం జతకట్టాడని బజ్ నడుస్తోంది. 2021లో వచ్చిన సూపర్‌హీరో బ్లాక్‌బస్టర్ ‘మిన్నల్ మురళి’ కి దర్శకుడు బాసిల్ జోసెఫ్.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లో మరో భారీ లెవెల్‌కు టర్న్ తీసు కుంటున్నాడు. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక సూపర్ గ్రాండ్, లార్జర్-దాన్-లైఫ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో బాలీవుడ్ సెన్సేషన్, సూపర్ హీరోయిన్ దీపికా పదుకొణె ఒక ప్రధాన హీరోయిన్గా కనిపించనుంది. ఈ స్టార్-స్టడెడ్ కాంబో ఇప్పటికే సినీ లవర్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఎక్సైట్మెంట్లో ముంచెత్తింది.
అల్లు అర్జున్, మలయాళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ టాలెంటెడ్ యాక్టర్-డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో కొత్త సినిమా కోసం జతకట్టాడని బజ్ నడుస్తోంది. 2021లో వచ్చిన సూపర్‌హీరో బ్లాక్‌బస్టర్ ‘మిన్నల్ మురళి’ కి దర్శకుడు బాసిల్ జోసెఫ్. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్‌ను అల్లు అర్జున్ హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ బ్యాక్ చేయనుందని టాక్.
ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోందట. రాబోయే కొన్ని నెలల్లో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. బాసిల్ జోసెఫ్ తన యూనిక్ స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ విజన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్‌కు ఫేమస్. అలాంటి డైరెక్టర్‌తో అల్లు అర్జున్ను స్క్రీన్‌పై ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లు ఫ్యాన్స్‌కు ఫుల్ థ్రిల్ ఇస్తున్నాయి. అట్లీతో ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, బాసిల్ జోసెఫ్‌తో ఒక ఫ్రెష్, యూనిక్ సినిమా... ఇలా అల్లు అర్జున్ సినిమాటిక్ జర్నీ రాబోయే రోజుల్లో మరింత కలర్ఫుల్గా, ఎక్సైటింగ్‌గా కనిపిస్తోంది.