‘ఆల్కాహాల్’ కు బానిసగా అల్లరి నరేష్
ఈరోజు (జూన్ 30) అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి ‘ఆల్కాహాల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.;
టాలీవుడ్ హీరోలలో తక్కువ సమయంలోనే 50 సినిమాల మైలురాయిని అందుకున్న కథానాయకుడు అల్లరి నరేష్. మొదట కామెడీ స్టార్ గా ఆడియన్స్ లో సెపరేట్ క్రేజ్ సంపాదించుకున్న నరేష్.. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఎమోషనల్ డెప్త్ ఉన్న పాత్రలతోనూ అలరిస్తున్నాడు. ఇప్పటికే సినిమాల పరంగా 60 చిత్రాల మైలురాయిని దాటేసిన అల్లరి నరేష్.. ఇప్పుడు వరుసగా మూడు సినిమాలలో నటిస్తున్నాడు. ఈరోజు (జూన్ 30) అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి ‘ఆల్కాహాల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్.
అల్లరి నరేష్ 63వ సినిమాగా సితార సంస్థలో ఒక చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకు దర్శకుడిగా మెహర్ తేజ్ వ్యవహరిస్తుండగా, హీరోయిన్గా రుహానీ శర్మ నటిస్తుంది. జీబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఆల్కాహాల్’ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లరి నరేశ్ ఇందులో ఆల్కాహాల్ కు బానిసైన వ్యక్తిగా కనిపించబోతున్నట్టు టాక్. మరోవైపు అల్లరి నరేష్ 'రాధ' ఫేమ్ చంద్రమోహన్ తో ‘రంభ ఊర్వశి మేనక’ అనే సినిమాతో పాటు.. ‘12ఏ – రైల్వే కాలనీ’ అనే మరో డిఫరెంట్ మూవీ అల్లరి నరేష్ కిట్టీలో ఉంది.