‘లెనిన్’ రిలీజ్ అయ్యేది ఆరోజేనా?
అక్టోబర్ నాటికి క్లైమాక్స్, ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేయడానికి వేగంగా పనిచేస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 17న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారని సమాచారం.;
అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రం కోసం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానులలో ఉత్సాహం వేగంగా పెరుగుతోంది. జైనాబ్ రవ్‌ద్జీతో వివాహం తర్వాత కొద్ది విరామం తీసుకున్న అఖిల్, ఇప్పుడు 'లెనిన్' చిత్రంతో మళ్ళీ తెరపైకి వస్తున్నాడు. 'ఏజెంట్' తర్వాత మళ్లీ ఈ యాక్షన్ డ్రామా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. విడుదల తేదీ ఖరారు కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
'వినరో భాగ్యం విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. చిత్ర బృందం అక్టోబర్ నాటికి క్లైమాక్స్, ప్యాచ్‌వర్క్‌ను పూర్తి చేయడానికి వేగంగా పనిచేస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 17న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారని సమాచారం.
ఈ చిత్రంలో నటీనటుల ఎంపికలో కూడా ఒక మార్పు జరిగింది. మొదట కథానాయికగా ఎంపికైన శ్రీలీల.. బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల కారణంగా షెడ్యూలింగ్ సమస్యల వల్ల తప్పుకుంది. ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు. శ్రీలీలతో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే చిత్రీకరణ జరగగా.. ఆ సన్నివేశాల్ని భాగ్యశ్రీతో తిరిగి చిత్రీకరించాల్సి వచ్చింది. ఈ ఆలస్యం ఉన్నప్పటికీ, నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.