నానీ - సుజీత్ ప్రాజెక్ట్ లోకి పృధ్విరాజ్ ?

పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ 'సలార్' చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ గా తెలుగు ప్రేక్షకులలో ఇప్పటికే సుపరిచితుడు.;

By :  K R K
Update: 2025-09-28 01:01 GMT

నేచురల్ స్టార్ నాని తన తదుపరి ప్రాజెక్టులతో మార్కెట్‌ను, తన ఇమేజ్‌ను మరింతగా పెంచుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా, నాని త్వరలో దర్శకుడు సుజీత్‌తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ 'ఓజీ' సినిమాతో తన సత్తాని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. తదుపరిగా అతడు నానీతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా గురించి తాజా చర్చ ఏమిటంటే.. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఆయన ప్రధాన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ 'సలార్' చిత్రంలో పృథ్వీరాజ్ విలన్ గా తెలుగు ప్రేక్షకులలో ఇప్పటికే సుపరిచితుడు. కాబట్టి ఈసారి అతడు నానీకి విలన్ గా నటించడం మరింతగా ఎక్సయిట్ అయ్యే విషయం. పృథ్వీరాజ్, సుజీత్, నాని అనే ఈ ముగ్గురు ప్రతిభావంతుల కలయిక ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది.

Tags:    

Similar News