‘అది దా సర్ప్రైజ్‘ అంటోన్న కేతిక!

Update: 2025-03-10 08:56 GMT

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాల్లో నితిన్ ‘రాబిన్‌హుడ్’ ఒకటి. ‘భీష్మ‘ వంటి హిట్ తర్వాత వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న సినిమా ఇది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.



Full View

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ‘రాబిన్‌హుడ్’ ఆల్బమ్ ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుంది. ‘ఒన్ మోర్ టైమ్, వేరెవర్ యు గో’ పాటలు శ్రోతలను మెప్పించాయి. ఇప్పుడు మూడో సింగిల్‌గా స్పెషల్ నంబర్ ‘అది దా సర్‌ప్రైజు’ వచ్చేస్తుంది.

ఈరోజు సాయంత్రం విడుదలవుతోన్న ఈ స్పెషల్ నంబర్ లో కేతిక శర్మ సందడి చేయబోతుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది టీమ్. ఈ ప్రోమోలో ‘అదిదా సర్ప్రైజ్‘ అంటూ కేతిక ఈ సాంగ్ గురించి సస్పెన్స్ లో పెట్టిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

Tags:    

Similar News