త్వరలోనే ‘96’ సీక్వెల్ షూటింగ్ !
స్క్రిప్ట్ పనులు దాదాపు కంప్లీట్ అయిపోయాయట. అంతేకాదు, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోందని కన్ఫర్మ్ చేశారు.;
మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, అందాల త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రొమాంటిక్ డ్రామా, హృదయాల్ని హత్తుకునే కథ, ఆత్మీయమైన పాత్రలతో కల్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందన్న హాట్ న్యూస్ ఫ్యాన్స్‌లో జోష్ నింపేస్తోంది. దర్శకుడు ప్రేమ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘96’ పార్ట్ 2 గురించి బిగ్ అప్‌డేట్ డ్రాప్ చేశారు.
స్క్రిప్ట్ పనులు దాదాపు కంప్లీట్ అయిపోయాయట. అంతేకాదు, త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోందని కన్ఫర్మ్ చేశారు. ఒరిజినల్ సినిమా ఎమోషనల్ డెప్త్, సోల్‌ఫుల్ స్టోరీ టెల్లింగ్‌తో అందరి మనసుల్ని గెలిచింది. ఇప్పుడు సీక్వెల్‌లో రామ్, జాను కథ ఎక్కడికి వెళ్తుంది? ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయి? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతానికి కథ, కాస్టింగ్, ఇతర డీటెయిల్స్ గురించి ఇంకా పెద్దగా ఇన్ఫో లీక్ కాలేదు, కానీ ఈ అప్‌డేట్ ఒక్కటే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసేస్తోంది. ‘96’ సినిమా ఫీల్‌ని మళ్లీ స్క్రీన్‌పై చూడాలని, రామ్, జాను లవ్ స్టోరీకి కొత్త ఛాప్టర్ ఎలా ఉండబోతోందని అభిమానులు సూపర్ ఎక్స్‌సైటెడ్‌గా ఉన్నారు.