2025 సెకండ్ హాఫ్.. భారీ చిత్రాల జాతర
2025 Second Half.. Huge Film Festival2025 ప్రథమార్థం తెలుగు సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదు. పలు పెద్ద, మధ్యస్థాయి చిత్రాలు ఆశించిన విజయం సాధించలేక బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. వేసవి కానుకగా విడుదల కావాల్సిన భారీ సినిమాలు వీఏఫ్ఎక్స్ ఆలస్యం, షూటింగ్ పనులు నెమ్మదిగా సాగడం, మార్కెట్ పరిస్థితుల కారణంగా రెండవార్షికార్థానికి వాయిదా పడ్డాయి. దీంతో 2025 ద్వితీయార్థం టాలీవుడ్ కు కీలకంగా మారింది. ఈ సీజన్ లో స్టార్ హీరోల చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సెప్టెంబర్‌లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, నందమూరి బాలకృష్ణ అఖండ 2 చిత్రాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ ఏడాది రెండు భారీ సినిమాలతో అభిమానుల ముందుకు రానున్నారు. హరిహర వీర మల్లు జూలైలో, OG సెప్టెంబర్‌లో థియేటర్లకు రానున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ బిగ్ బడ్జెట్ సినిమా ఆగస్టులో విడుదల కానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్‌లో చేస్తున్న తొలి సినిమా వార్ 2 (హృతిక్ రోషన్‌తో కలిసి) స్వాతంత్ర్య దినోత్సవ వారాంతానికి విడుదల అవుతుంది.
బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే సినిమాతో జూలైలో లక్ పరీక్షించుకోనున్నాడు. మాస్ మహారాజా రవితేజ మాస్ జాతర ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తేజ సజ్జా మిరాయ్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మితమైంది. అదివి శేష్ డాకాయిట్, సాయి ధరమ్ తేజ్ సాంబరాల యేటి గట్టు, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, కిరణ్ అబ్బవరం కే రాంప్, అఖిల్ లెనిన్, నిఖిల్ స్వయంభూ వంటి సినిమాలు కూడా ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
డబ్బింగ్ చిత్రాల్లో శివకార్తికేయన్ నటించిన మధరాసి సెప్టెంబర్ 5న, కన్నడలో ఘన విజయం సాధించిన కాంతారా: ఏ లెజెండ్ చాప్టర్ 1 అక్టోబర్ 2న విడుదల అవుతాయి. సూర్య నటించిన కరుప్పు, కార్తీ సర్దార్ 2 కూడా అక్టోబర్‌లో థియేటర్లకు రానున్నాయి.
ఇదిలా ఉంటే… 2025 రెండో భాగం తెలుగు సినీ పరిశ్రమకు మరింత క్రుషియల్‌గా మారుతోంది. వరుసగా భారీ సినిమాలు థియేటర్లను సందడి చేయనున్నాయి. ఈసారి అయినా పరిశ్రమ బౌన్స్‌బ్యాక్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.