థియేటర్లు ఖాళీ.. కారణం ఎవరు?

సినిమా థియేటర్ల పరిస్థితిపై దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పందించిన తీరు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.;

By :  S D R
Update: 2025-04-16 16:11 GMT

సినిమా థియేటర్ల పరిస్థితిపై దర్శకుడు త్రినాథరావు నక్కిన స్పందించిన తీరు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. 'చౌర్యపాఠం' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, 'ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. షోలు రద్దవుతున్నాయి. సెకండ్ షోలకైతే మరీ స్థితి దారుణం' అని ఆవేదనతో చెప్పారు. థియేటర్ పరిస్థితిని స్వయంగా రెండు రాష్ట్రాల్లో పరిశీలించి మాట్లాడుతున్నానంటూ ఆయన అన్నారు.

అయితే ఇదే విషయాన్ని మరో కోణంలో చూస్తే.. 'సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్, మ్యాడ్ స్క్వేర్' వంటి సినిమాలకు జనం థియేటర్లకు పోటెత్తారు. వీటిలో 'కోర్ట్, మ్యాడ్ స్క్వేర్' చిన్న సినిమాలు. అయినా పెద్ద విజయాలు సాధించాయి. ఈ సినిమాల విజయాలలో కంటెంట్ బలమే ప్రధానమని స్పష్టమవుతోంది.

త్రినాథరావు గత చిత్రం 'మజాకా'నే తీసుకుంటే, అది అంతగా ఆడకపోవడం కూడా కంటెంట్ పైనే ఆధారపడిన విషయం. ఈ సందర్భంలో ‘పబ్లిక్ సిద్ధంగా ఉంది, కానీ మనం వారికి ఏం అందిస్తున్నామన్నది ప్రశ్న’ అనే అంశాన్ని విస్మరించలేం.

Tags:    

Similar News