‘అవతార్ 3‘ ట్రైలర్ వస్తోంది!
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ మాయాజాలం 'అవతార్'. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలూ వరల్డ్ వైడ్ గా వేల కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టాయి.;
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ మాయాజాలం 'అవతార్'. ఇప్పటికే ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలూ వరల్డ్ వైడ్ గా వేల కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో మరో సీక్వెల్ 'అవతార్ 3: ఫైర్ అండ్ యాష్' రాబోతుంది. ఈ ఏడాది డిసెంబర్ 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ పోషిస్తున్న 'వరంగ్' అనే కొత్త పాత్రను పరిచయం చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను జులై 25న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. హాలీవుడ్ మూవీ ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’తో పాటు ఈ ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు.
‘అవతార్ 2’లో నీటి ఆధారిత ప్రపంచాన్ని చూపిన కామెరూన్, ఈసారి అగ్నిని థీమ్‌గా ఎంచుకున్నాడు. 'ఫైర్ అండ్ యాష్'లో అగ్నికి సంబంధించి కొత్త నెయివీ తెగను చూపించనున్నట్లు సమాచారం. ‘అవతార్ 3‘ ఈ ఏడాది డిసెంబర్ లో వస్తుంటే.. 2029లో ‘అవతార్ 4’, 2031లో ‘అవతార్ 5’ విడుదల కానున్నాయి.