‘భైరవం‘ టీజర్.. యువ హీరోల మాస్ బీభత్సం!

యువ కథానాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ ‘భైరవం‘. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.;

By :  S D R
Update: 2025-01-20 12:22 GMT

యువ కథానాయకులు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ ‘భైరవం‘. తమిళంలో హిట్టైన 'గరుడన్' రీమేక్ గా ఈ సినిమాని విజయ్ కనకమేడల రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ‘ఓ వెన్నెల‘ పాటకు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.


Full View



టీజర్ ఆద్యంతం బెల్లంకొండ, రోహిత్, మనోజ్ ల మాస్ బీభత్సంతో ఆకట్టుకుంటుంది. ప్రతీ హీరోకి ఇచ్చిన మాస్ ఎలివేషన్ ఈ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై ఫీమేల్ లీడ్స్ లో నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో జయసుధ, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహితస్వ, సంపత్ రాజ్, సందీప్ రాజ్, వెన్నెల కిషోర్ కనిపించనున్నారు.


శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. డా. జయంతి లాల్ గడా సమర్పణలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ‘భైరవం‘ మూవీ థియేటర్లలోకి రాబోతుంది.


Full View


Tags:    

Similar News