థియేటర్ల బంద్ వెనుక వ్యూహం?

తెలుగు చిత్ర పరిశ్రమలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు సంబంధించిన ప్రకటన గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) రెంటెడ్ విధానాన్ని తొలగించి, షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.;

By :  S D R
Update: 2025-05-23 15:16 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్‌కు సంబంధించిన ప్రకటన గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) రెంటెడ్ విధానాన్ని తొలగించి, షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ బంద్ వెనుక ఓ నాటకం ఉందా? ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ఆపేందుకు కొంతమంది నిర్మాతలు-ఎగ్జిబిటర్లు కుట్ర పన్నారనే అనుమానాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఈ బంద్ ప్రకటన సరిగ్గా 'హరిహర వీరమల్లు' చిత్రం విడుదల తేదీ (జూన్ 12, 2025) సమీపిస్తున్న సమయంలో రావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. సోషల్ మీడియాలో కొందరు ఈ బంద్‌ను 'హరిహర వీరమల్లు' విడుదలను అడ్డుకునే కుట్రగా భావిస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు.

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులలో ఒకటి. ఈ చిత్రం 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్. ఇక కొందరు నిర్మాతలు ఎగ్జిబిటర్లుగా కూడా ఉండటం, ఈ బంద్ నిర్ణయం వెనుక వారి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా.. ఇప్పటికైతే థియేటర్ల బంద్ నిర్ణయం ఆగిపోయినట్టే అనేది ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News