రేపటికి వాయిదా పడ్డ 'తండేల్' ప్రీరిలీజ్
నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. 'తండేల్' జాతర పేరుతో హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్న ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని ప్రకటించారు.;
నాగచైతన్య హీరోగా నటించిన 'తండేల్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. 'తండేల్' జాతర పేరుతో హైదరాబాద్ లో నిర్వహించాలనుకున్న ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని ప్రకటించారు. ఈకోవలోనే తండేల్ రాజు కోసం పుష్పరాజ్ వస్తున్నాడని పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే ఈరోజు జరగాల్సిన 'తండేల్' ఈవెంట్ రద్దయ్యింది. రేపు మరింత గ్రాండ్ గా 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్. ఈ మార్పుతో బన్నీ, చైతూ అభిమానులు తమ ఎగ్జైట్మెంట్‌ను మరొక రోజు పాటు ఆపుకోవాల్సిందే.
'పుష్ప 2' తర్వాత రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ నుంచి వస్తోన్న సినిమా 'తండేల్'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్ కూడా తన మ్యూజికల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టనున్నాడనే ప్రచారం జరుగుతుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించాడు. చైతూకి జోడీగా సాయిపల్లవి నటించింది. ఫిబ్రవరి 7న 'తండేల్' థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది.