‘కుబేర‘ కలెక్షన్ల హవా!
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర‘ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది.;
By : S D R
Update: 2025-06-24 10:42 GMT
ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘కుబేర‘ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమా అద్భుతంగా వసూళ్లు రాబడుతోంది.
నైజాంలో నాలుగు రోజుల్లో రూ.11 కోట్ల షేర్ సాధించింది. సోమవారం కూడా స్టడీ పెర్ఫామెన్స్ కొనసాగించి రూ.1.4 కోట్ల షేర్ రాబట్టింది. నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్లను కొల్లగొట్టిన ‘కుబేర‘ ఓవరాల్ గా ఓవర్సీస్ లో రూ.23 కోట్లకు పైగా రాబట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే ‘కుబేర‘ వంద కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలున్నాయి.