'జాట్' సందడి మొదలైంది!
బాలీవుడ్ వెటరన్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన చిత్రం 'జాట్'.;
బాలీవుడ్ వెటరన్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రూపొందిన చిత్రం 'జాట్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10, 2025న విడుదలకు సిద్ధమవుతోంది.
'జాట్' నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఈరోజు ఈ చిత్రం నుంచి ట్రైలర్ రాబోతుంది. ట్రైలర్ కి ముందే ఓ ప్రిల్యూడ్ ని కూడా వదిలారు. హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో ట్రైలర్ ఓ రేంజులో ఉండబోతుందని ప్రిల్యూడ్ చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమా నుంచి ఒక్కొక్కటిగా క్యారెక్టర్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ లిస్టులో జగపతిబాబు సత్యమూర్తిగా సీబీఐ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. రమ్యకృష్ణ శక్తివంతమైన వసుంధర పాత్రలో కనువిందు చేయనుంది. ఇంకా రెజీనా భారతి పాత్రలోనూ, సయామీ ఖేర్ పోలీస్ విజయ లక్ష్మి పాత్రలో అలరించనున్నారు. మొత్తంగా ఏప్రిల్ లో రాబోతున్న చిత్రాలలో 'జాట్' భారీ అంచనాలను పెంచుతుంది.