‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్ వస్తోంది!

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 10న రెండు భారీ చిత్రాలను తీసుకొస్తుంది. ఈ రెండు సినిమాలూ పరభాషా చిత్రాలే.;

By :  S D R
Update: 2025-04-04 06:55 GMT

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 10న రెండు భారీ చిత్రాలను తీసుకొస్తుంది. ఈ రెండు సినిమాలూ పరభాషా చిత్రాలే. వీటిలో ఒకటి హిందీ సినిమా ‘జాట్‘ కాగా.. మరొకటి తమిళ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘. వీటిలో ఇప్పటికే ‘జాట్‘ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ ట్రైలర్ రాబోతుంది.

ఈరోజే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే.. ట్రైలర్ ఏ సమాయానికి వస్తోంది? అనేది తెలియాల్సి ఉంది. అజిత్, త్రిష జంటగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘పై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అజిత్ మూడు డిఫరెంట్ షేడ్స్ లో అలరించనున్నాడు. జి.వి.ప్రకాష్ సంగీతాన్నందించిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మొత్తంగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ‘ ట్రైలర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News