‘ది గర్ల్‌ఫ్రెండ్’ మెలోడీ మేజిక్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ తో నేషనల్ లెవెల్ లో క్రేజీ స్టార్ గా మారింది రిష్మిక. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.;
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ తో నేషనల్ లెవెల్ లో క్రేజీ స్టార్ గా మారింది రిష్మిక. ఇప్పుడు ఈ నేషనల్ క్రష్ 'ది గర్ల్‌ఫ్రెండ్' అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘నదివే...’ సాంగ్ ప్రోమో రిలీజైంది. ఈ మెలోడీ సాంగ్‌ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేయగా, ఈరోజు (జూలై 16) సాయంత్రం 4:05 గంటలకు ఫుల్ సాంగ్ రానుంది. హీరోహీరోయిన్లు రష్మిక, హీరో దీక్షిత్ శెట్టి లు ఈ పాటలో డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
రాహుల్ రవీంద్రన్ గత చిత్రాలు ‘చిలసౌ, మన్మథుడు 2’ల పాటలు మంచి హిట్ కావడంతో ఈ చిత్రంలోని పాటలపై అంచనాలు పెరిగాయి. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నట్లు యూనిట్ వెల్లడించింది.